బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాకుండా గులాబీ పార్టీ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కాదని.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తమను కోరారని.. అయితే మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు, తోలు తీస్తామని మరొకరు మాట్లాడారని.. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీయాలో ప్రజలే తేల్చేవారని అన్నారు.

