
తను మాట్లాడిన మాటల్లో కావాల్సిన వాటిని మాత్రమే ప్రసారం చేయడమో, పబ్లిష్ చేయడమో చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తను మాట్లాడిన ముఖ్యమైన విషయాలు వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన విషయం మాత్రమే పేపర్లలో రాస్తున్నారు అంటూ షర్మిల విమర్శించారు. ఆమె వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడిన విషయాలు హైలెట్ కాలేదు. కొన్ని పేపర్లు అయితే అసలు పట్టించుకోలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరగడంతో ఆమె మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి తనను కొన్ని మీడియాలు వాడుకుంటున్నాయి అన్నట్టుగా మాట్లాడారు.