
‘నా ఫీడ్ క్లియర్ చేస్తుంటే పొరపాటున లైక్ పడ్డట్టుగా ఉంది. నేను, ఇది కావాలని చేసింది కాదు. కాబట్టి మీరంతా అనవసరంగా కథలు అల్లేయొద్దని వేడుకుంటున్నా… అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ..’ అంటూ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ, తన ఇన్స్టాగ్రామ్లో క్లారిటీ ఇస్తూ చేసిన పోస్ట్.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం జరిగింది? ఎందుకు పోస్ట్ పెట్టాడనేది చాలా మందికి అర్థం కాలేదు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మీమ్స్, సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి.