
విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారంటూ వైసీపీ వీడియోపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానన్న విజయసాయిరెడ్డి.. తనకు కృష్ణగారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. వారందరూ కూడా తన కుమార్తె వివాహానికి వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన సమయంలోనే టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం తనకు తెలియదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.