అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తడకపల్లి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణీని ఆమె కుటుంబ సభ్యులు సుమారు 7 కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలతో కూడిన కష్టతరమైన బాటలో డోలీలోనే మోసుకెళ్లాల్సి వచ్చింది. నెలలు నిండిన గర్భంతో ఉన్న మహిళను అంతటి దూరం మోయడం కుటుంబ సభ్యులకు అత్యంత శ్రమతో కూడుకున్నదిగా మారింది. తీసుకెళ్తుంటే కొండలు, గుట్టల్లో జారి పడిపోతే కనుక అటు గర్బిణీతో పాటు తీసుకెళ్లే వారి ప్రాణాలు సైతం ప్రమాదంలో పడతాయని చెబుతున్నారు.