
ిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రాజులపాలెం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. సిఎంఆర్ ఎకో అల్యూమినియం పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో పరిశ్రమ సగానికి పైగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారి పక్కన పరిశ్రమ ఉండటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.