కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరికినా అది కల్తీదే అన్నారు. మార్కెట్లో కిలో నెయ్యి 1000 రూపాయలు పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీకాక మరేంటని? ప్రశ్నించారు. టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఫైనల్స్‌కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ కూడా తానే తీసుకుంటాని వెల్లడించారు. బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

