తెలంగాణ కళాకారులు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. అర్హులైన కళాకారులకు సాంస్కృతిక సారథిలో తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని మంగళవారం ఇందిరాపార్కు వద్ద పోరు దీక్ష చేపట్టారు.

