పశ్చిమ బెంగాల్‌లో కీలక ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ బదిలీలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జేపీ మీనా, డీజీపీ మరియు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ చర్యపై స్పందించిన మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

