
ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాజం నుంచి పుట్టిన అరకు కాఫీ, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ విజయాన్ని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర ప్రశంసించగా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలియజేశారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా అరకు కాఫీ ప్రయాణాన్ని ప్రశంసించారు. “బీన్ నుండి కప్పు వరకు – అరకు కాఫీ యొక్క ప్రయాణం గిరిజన రైతుల కృషికి అద్దం పడుతోంది. ఇది ఒక ఆదర్శ ప్రాజెక్ట్” అని ఆయన పేర్కొన్నారు..