అల్లూరి జిల్లాలోని బస్కి పంచాయతీ కంజరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ గిరిజన రైతుకు సంబంధించిన కాఫీ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో జి. అప్పలనాయుడుకి చెందిన సుమారు 2 ఎకరాల కాఫీ తోట మంటల్లో కాలిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో కాఫీతో పాటు మిరియాల పంట కూడా పూర్తిగా కాలిపోయింది.స్థానిక అధికారులు కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లి మిగిలిన తోటలను రక్షించడానికి చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో రైతుకు దాదాపు రూ.5 లక్షల పంట నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

