శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని బోర్డు నిశ్చయించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన చట్టబద్ధమైన బాధ్యత తమపై ఉందని, అందుకే మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలను, పవిత్రతను కాపాడటానికే బోర్డు ఏర్పడిందని గుర్తుచేశారు.

