పర్షియన్ గల్ఫ్ వేదికగా అమెరికా గనుక భూతల దాడులకు దిగితే, ఆ దేశ సైనికులు సముద్రంలోని “షార్క్ చేపలకు ఆహారంగా” మారుతారని ఇరాన్ అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించింది. ఇరాన్ సాయుధ దళాలకు చెందిన ‘ఖతం అల్-అన్బియా’ సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జొల్ఫకరి మార్చి 29, 2026న విడుదల చేసిన వీడియో ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

