
ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోని అమెరికా ఎట్టకేలకు యుద్ధరంగంలోకి దిగింది. అమెరికా సైనిక జోక్యం చేసుకోవద్దని ఇరాన్ మొదట్నుంచీ చెబుతోంది. కానీ ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో అణు స్థావరాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో దాడులు చేసింది ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు. తమ అణస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.