
అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో మరింత తీవ్రమైంది. ఒకదానిపై ఒకటి భారీ టారిఫ్‌లు విధించడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారాయి. జెనీవాలో రెండు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ముగిసిన తరువాత ఒప్పంద గురించి తాజాగా ప్రకటన వెలువడింది. అమెరికా వస్తువులపై సుంకాలను 125 నుంచి నుంచి 10 శాతానికి చైనా.. చైనా వస్తువులపై 145 నుంచి 30 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించారు.