
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్’ ను చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం.