
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ఖండించారు. ఈ పహల్గాం ఉగ్రదాడిపై జె.డి. వాన్స్ ఎక్స్ వేదికన రియాక్ట్ అయ్యారు. ”ఉషా, నేను పహల్గాంలో జరిగిన ఈ దారుణ ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాం” అని వాన్స్ పోస్ట్ చేశారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఒక్కసారిగా ఉగ్రవాదాలు కాల్పులకు తెగబడ్డారు. కేవలం హిందూ టూరిస్టులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు… దీంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.