
అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత తొలిసారిగా అమెరికా షట్ డౌన్ బాట పట్టింది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలం కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది అటువంటి పరిస్థితిలో, అమెరికా ప్రభుత్వం అనవసర సేవలను నిలిపివేయవలసి వస్తుంది. నిధుల ఆమోదించబడే వరకు అవసరం లేని ప్రభుత్వ విభాగాలు, సేవలు మూసివేయాలి. దీనిని అమెరికా ప్రభుత్వ షట్డౌన్ అని పిలుస్తారు.