
భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపు లోకి తీసుకున్నారు.
ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు. సోషల్ మీడియా యూజర్, సామాజిక వ్యవస్థాపకుడు, కునాల్ జైన్ ఈ దారుణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.