అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, ఆయనను దేశపు ‘ఫ్రాడ్ జార్’ గా నియమించారు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జరుగుతున్న భారీ అవినీతిని వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. హెల్త్‌కేర్ సిస్టమ్‌లో సుమారు 50 మిలియన్ డాలర్ల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు

