ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు ‘రాజా సాబ్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు 6 లక్షల డాలర్లు దాటి వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రత్యాంగీరా సినిమాస్ సుమారు 18 నుంచి 20 కోట్ల మధ్య దక్కించుకుందని సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 2.8 నుండి 3 మిలియన్ డాలర్ల వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు బిజినెస్ పరంగా రిస్క్ కొంచెం తక్కువగానే ఉంది.

