అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అమెరికాలోని ఉత్తర కరోలీనాలో షార్లెట్‌లో నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది.
షార్లెట్‌లో తెలుగు వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్ఠను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి కోరారు విభాగం ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

