
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 21 ఏళ్ల భారతీయుడు జస్ప్రీత్ సింగ్ మద్యం మత్తులో ట్రక్కు నడుపుతున్నాడని,బ్రేక్‌లు కూడా వేయలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడైన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. జస్ప్రీత్ సింగ్‌కు అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఇమ్మిగ్రేషన్ హోదా లేదని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్
సెక్యూరిటీ (DHS) నిర్ధారించింది. అతను 2022లో దక్షిణ సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించాడని తెలుస్తోంది.