ఇరాన్‌తో రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, దీంతో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేయాలని తన బలగాలను ఆదేశించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. తమ ఇంధన సంస్థలపై ఎలాంటి దాడులు చేసినా శత్రువుల ఇంధన వనరులపై దాడి చేస్తామని టెహ్రాన్ గట్టి హెచ్చరిక చేసినట్టు తెలిపింది.

