
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్తాన్ అరుదైన ఖనిజ సంపద దోచిపెట్టే కార్యక్రమం మొదలైంది. పాకిస్తాన్ లోని అరుదైన భూమి, కీలక ఖనిజాలతో కూడిన మొదటి నౌక అమెరికాకు బయలు దేరింది.
పాకిస్తాన్ లో ఖనిజ వనరులను అన్వేషించేందుకు, ఓ అమెరికన్ కంపెనీతో సంతకం చేసిన ఒప్పందానికి అనుగుణంగా ఈ అరుదైన ఖనిజసంపద ఎగుమతి అవుతోంది. అమెరికాకు రవాణా అయిన వాటిలో యాంటీ మోనీ, రాగి గాఢత, నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన భూ మూలకాలు ఉన్నాయి.