అమెజాన్ సంస్థలో వివిధ విభాగాల్లోని 14 వేల మంది ఉద్యోగులకు మేలో లేఆఫ్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో కార్పొరేట్ విభాగాలు, మిడ్ లెవల్ మేనేజర్లు, మానవ వనరుల విభాగం తదితర ఉద్యోగాలున్నాయి. అమెజాన్ గతేడాది అక్టోబరులో 14,000 మందిని, ఈ ఏడాది జనవరిలో 16,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఇటీవల ఒరాకిల్ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో 12వేల మంది భారతీయులే.

