పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అమిత్ షాను ‘యాక్టింగ్ పీఎం’ అని అభివర్ణించారు. ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను మోసం చేసిన 18వ శతాబ్దపు బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్‌తో అమిత్ షాను మమతా బెనర్జీ పోల్చారు.

