అమరావతి బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడంపై ఉద్ధండరాయునిపాలెంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సతీసమేతంగా వెళ్లిన సీఎం చంద్రబాబుకు అక్కడి రైతులు, మహిళలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి పునాదికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. గతంలో ఇదే చోట రాజధానికి శంకుస్థాపన జరిగింది. ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిందని చంద్రబాబు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

