ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు(గురువారం) ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభ ఆమోదం తర్వాత బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లనుంది. కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేయనుంది. తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.

