వైసీపీ ఈ బిల్లు పైన పార్లమెంట్ లో అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే… అమరావతిలో రైతులను భూములు సమీక రించిన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రశ్నించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని..
కొందరు కాంట్రాక్టర్లకు అవీతినికి చిరునామా గా మారుతోందని విమర్శించారు. రైతులకు ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ బిల్లును యధాతధంగా ఆమోదించేందుకు తాము సిద్దంగా లేమని స్పష్టం చేసారు. ఆ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసారు.

