బాపట్ల జిల్లా వేమూరు మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేల రైతుల సమక్షంలో పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేశారు. అమరావతి రాజధాని విషయంలో ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ, “మొన్న మూడు ముక్కలాట ఆడాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అమరావతి ఆగదు” అని చంద్రబాబు హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ బెదిరించాడని, అపోజిషన్‌లో ఉంటూ కూడా బెదిరిస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. అమరావతి కోసం 2లక్షల కోట్లు అవసరం లేదనీ.. అభివృద్ధికి కావాల్సిన డబ్బును అమరావతి స్వయంగా సృష్టించుకుంటుందని చంద్రబాబు తెలిపారు.

