
అమరావతిలో భూమి ప్రజలదని, అభివృద్ధి ఖర్చులు కూడా ప్రజలవేనని, కానీ ఆదాయం మాత్రం చంద్రబాబుది, చంద్రబాబు బీనామీలదేనంటూ విమర్శలు చేసింది వైఎస్ఆర్సీపీ. ట్రూత్ బాంబు పేరుతో కీలక డాక్యమెంట్స్ను బయటపెట్టింది. చంద్రబాబు అసలు అవినీతి కథ అంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అమరావతిలో ఫ్రీ అన్న మాటే పచ్చి అబద్ధమని పేర్కొంది. ఫ్రీ అయితే స్టార్టప్ ఏరియా ఒప్పందంలో 42 శాతం డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది.