
అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఓయూలను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది.