అమరావతి రాజధాని చట్టబద్ధతపై ఏపీ జేఏసి అమరావతి హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీజేఏసీ నేతలు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రాజధాని అమరావతి లో ఉద్యోగులకు ఇంటి స్థలాలు వీలైనంత త్వరగా కేటాయిస్తే,
ఇల్లు నిర్మించుకుని ఉద్యోగ కుటుంబాలన్నీ సంతోషిస్తాయని తెలిపారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ప్రత్యేకంగా రిటైర్, చనిపోయిన ఉద్యోగులకు తక్షణమే చెల్లించాలని, మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషనర్ నియామకం జరపాలని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.

