రాష్ట్ర రాజధాని అమరావతిలో ఓ ఇంజినీరింగ్ విద్యా ర్థిని ఆత్మహత్య కలకలం రేపింది. గత కొం తకాలంగా మానసిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతూ ఆదివారం ఆమె బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ నిజాంపేట్ చెందిన గొట్టిముక్కల గోపాలరావు కుమార్తె శ్రీవల్లిశ్వేత రాజధాని అమరావతి ప్రాంతంలో వున్న అమృత విశ్వవిద్యాలయంలో బిటెక్ నాల్గవ సంవత్సరం చదువుతుంది. ఆదివారం మధ్యాహ్నం నుండి తనకు మనశాంతి కావాలంటూ హాస్టల్ గదిలోని విద్యార్థులను బయటకు పంపి రాత్రి 9 గంటల సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

