అమరావతిలో జరుగుతున్న ప్రాజెక్టులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులపై సీఎం ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్‌కు వివరించారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థికసాయం అందించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం అన్నివిధాలుగా ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అభివృద్దే లక్ష్యంగా రాష్ట్రానికి అన్ని విధాలా సహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధిపై, పలు ప్రాజెక్టుల గురించి చర్చించారు.

