
గతంతో పోలిస్తే మంచు లక్ష్మీ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచు వారమ్మాయి. టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆమె పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని డెవలప్ చేస్తోంది. స్కూల్స్ లో డిజిటల్ తరగతుల ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని డెవలప్ చేస్తోంది మంచు లక్ష్మి. ఇప్పుడు అమరావతిలోనూ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.