
అమరావతి రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయింది. రాజధాని రెండో విడత భూసేకరణను ఆమోదించింది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని.. వరద జలాలను మనం వాడుకుంటామని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని సూచించారు.