క్రికెట్ అభిమానులకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని BCCI అధికారికంగా ప్రకటించింది. సిడ్నీ ఆసుపత్రి నుంచి శ్రేయస్ ఇవాళ డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం స్థిరంగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది. ‘శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు కోలుకుంటున్న తీరుపై బీసీసీఐ వైద్య బృందంతో పాటు సిడ్నీ, భారత వైద్య నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.

