దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజాగా అబుదాబిలోని BAPS హిందూ మందిరాన్ని సందర్శించారు. దాన్ని సందర్శించిన అనంతరం ఇది తన జీవితంలోనే అత్యంత అసాధారణ అనుభవాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. బ్రహ్మవిహరిదాస్ స్వామి ఆయనకు సాదరంగా స్వాగతం పలికగా.. మందిరంలోని అద్భుతమైన కళానైపుణ్యాన్ని సీఎం చంద్రబాబుకు చూపించారు. మందిరంలోని ప్రతీ కళాకృతికు సంబంధించి సందేశాలను బ్రహ్మవిహారిదాస్ చంద్రబాబుకు వివరించారు. 3డీ వాల్ ఆఫ్ హార్మొనీని చూపిస్తూ.. ఇది మందిరం సమగ్రత సందేశాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

