డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొన్ని ఎయిర్‌బస్ మోడళ్లకు సంబంధించి సేఫ్టీ ఆదేశాలు జారీ చేసింది. డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఎ318, ఎ319, ఎ320, ఎ321 విమానాలతో సహా కొన్ని ఎయిర్‌బస్ మోడళ్లలో తనిఖీలు, మార్పులు తప్పనిసరి. ఎయిర్‌బస్ నుండి వచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది. డీజీసీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, తప్పనిసరి మార్పులు, సంబంధిత విమాన ఆదేశాలను పాటించనిదే తాము పేర్కొన్న జాబితాలో ఉన్న విమానాలను ఎవరూ నడపడానికి అనుమతి లేదు.

