ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి సమీపంలోని పంపా రిజర్వాయర్ పరిసరాల్లో పెద్దపులి ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అన్నవరం పంపా రిజర్వాయర్ సమీప ప్రాంతంలో అది సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు మరియు స్థానిక ప్రజలకు అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

