మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న నూతన చిత్రం (Mega158) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై పవన్ కళ్యాణ్ మొదటి క్లాప్ కొట్టడం ఈ ఓపెనింగ్ ఈవెంట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఒకే వేదికపై నవ్వుతూ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

