
ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు.
కేంద్రమంత్రి గుజరాత్ గాంధీనగర్‌లో మూడులల పాటు జరిగే ‘మీ సొమ్ము-మీ హక్కు’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెండ్ ఫండ్, షేర్లు తదితర రూపాల్లో బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84 లక్షల కోట్ల నిధులు మూలుగుతున్నాయన్న ఆర్థిక మంత్రి.