మెగాస్టార్ చిరంజీవి ప్రయాణంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. కారు నచ్చిందా?’ అని అడిగారు. అప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో మందు కొట్టడానికి ముందు చిరంజీవి చెప్పిన డైలాగ్ కాస్త మార్చి చెప్పారు అనిల్ రావిపూడి. ‘మెగా బహుమతి మహదానందం మనో ధైర్యం ధనాధన్’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

