ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దానం నాగేందర్ పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ తీర్పును కొట్టివేయాలని ఏలేటి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్.. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని న్యాయస్థానం దృష్టికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు.

