
రజినీకాంత్ కూలీ చిత్రంలో చాలా కేమియోస్ ఉన్నాయని అర్థం అవుతోంది. రజినీకాంత్ మెయిన్ హీరో అయినా కూడా నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ గెస్ట్ అప్పియరెన్స్ లిస్టులో ఉపేంద్ర కూడా చేరిపోయాడు. కూలీలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని కూడా టీం ప్రకటించలేదు. కానీ ఉపేంద్ర మాత్రం అన్నింటినీ కన్ఫామ్ చేసేశాడు. కూలీ చిత్రంలో తాను నటిస్తున్నానని ఓపెన్‌గా చెప్పేశాడు.అసలు సిసలు పాన్ ఇండియా మూవీ అనిపించుకునేందుకు అన్ని ఇండస్ట్రీల హీరోల్ని ఇందులోకి తీసుకు వస్తున్నాడు లోకేష్ కనకరాజ్.