
భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇండియా ఆర్థికవ్యవస్థ చచ్చిపోయిందని ఆరోపించారు. ట్రంప్ అన్నది కరెక్టేనని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్.. రష్యాతో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా నాకు అవసరం లేదు. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మొత్తం కూల్చేసుకున్నా నాకు పట్టింపు లేదని ట్రంప్ అన్నారు. ఈ విషయం ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్లకు తప్ప ప్రపంచంలోని అందరికీ తెలుసన్నారు. ట్రంప్ ఈ నిజాన్ని చెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు.