
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ చేశారు. “బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా… ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమే. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా. ఫోన్ ట్యాపింగ్‌పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు విచారణ వేగవంతం చేయాలి.