మరోవైపు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరగడం చూసి కూటమి నేతలకు కడుపుమంటగా ఉందని వైసీపీ నేత వరుదు కళ్యాణి ఆరోపించారు. కడుపు మంట ఎక్కువై.. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత,
డీజీపీ, వైసీపీ కార్యకర్తలపై ఏవిధంగా అక్రమ కేసులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారని విమర్శించారు. బాలకృష్ణ సినిమా విడుదల సమయంలో చేసిన జంతు బలుల గురించి ఎందుకు మాట్లాడరని..ఓజీ సినిమా అప్పుడు కత్తులు చూపిస్తే ఎందుకు మాట్లాడలేదని హోం మంత్రి వంగలపూడి అనితను వరుదు కళ్యాణి ప్రశ్నించారు.

